కేసీఆర్‌ ఇస్తుంటే కేంద్రం లాక్కుంటోంది: హరీశ్‌రావు

ప్రధానాంశాలు

కేసీఆర్‌ ఇస్తుంటే కేంద్రం లాక్కుంటోంది: హరీశ్‌రావు

జమ్మికుంట గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల అభ్యున్నతికి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కేసీఆర్‌ కుడి చేత్తో ఇస్తుంటే.. కేంద్రం ఎడమ చేత్తో లాక్కుంటోందని మండిపడ్డారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట మండల కేంద్రంలో గురువారం మహిళా సంఘాల సభ్యులకు రూ.3.14 కోట్ల స్త్రీనిధి, వడ్డీ లేని రుణాల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వచ్చే మార్చి నాటికి రైతుల లక్ష లోపు రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. కరోనా లేకుంటే ఇప్పటికే రైతు రుణమాఫీ పూర్తి చేసేవారమన్నారు. మహిళలు ఆర్థిక అభ్యున్నతి సాధించేందుకు ప్రతి గ్రామంలో కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి    సారిస్తున్నట్లు తెలిపారు. 57 ఏళ్లు నిండిన వారికి త్వరలో పింఛన్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని