సీఎం కేసీఆర్‌తోనే నాకు పోటీ

ప్రధానాంశాలు

సీఎం కేసీఆర్‌తోనే నాకు పోటీ

ఎన్నికల ప్రచారంలో ఈటల వ్యాఖ్య

వీణవంక, జమ్మికుంట గ్రామీణం, కమలాపూర్‌-న్యూస్‌టుడే: ‘నేను పోయిన నాడు నా ప్రజలు కంటతడి పెట్టాలి అనేలా బతుకుతున్నా’ అని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం మల్లన్నపల్లి గ్రామంలో శనివారం జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘రెండు గుంటల భూమి ఉన్న వ్యక్తిని నాపై పోటీకి పెట్టామని చెబుతున్నారు. రెండు గుంటలు అమ్మితే రూ.లక్ష వస్తాయి. కానీ రూ.250 కోట్లు ఎలా ఖర్చు పెట్టారు. నాకు పోటీ ఆయనతో కాదు సీఎం కేసీఆర్‌తోనే. కోట్ల రూపాయలతో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, కటౌట్లు పెడుతున్నారు. కానీ అవి గాలివానకు పోతాయి. ప్రజల గుండెల్లో నేను మాత్రం అలాగే ఉంటా’’ అని ఈటల వ్యాఖ్యానించారు. ‘‘భాజపాలో ఉన్న వారికి దళితబంధు ఇవ్వనంటున్నారట.. తెలంగాణ ఎవరి జాగీరు కాదు. ఎలా ఇవ్వరో చూస్తా’’ అని పేర్కొన్నారు. జమ్మికుంట మండలం మడిపల్లిలో పార్టీలో చేరికల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలోనూ ఈటల పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘హుజూరాబాద్‌లో ధర్మానికి, న్యాయానికి స్థానం ఉంటుంది. మేం ప్రశాంతంగా ఉంటాం. మా జోలికి వస్తే మాత్రం ఊరుకోం’’ అని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి.. జైలులో పెడితే ముందు తననే పెట్టాలని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి కమలాపూర్‌ మండలం భీంపల్లిలో మాట్లాడుతూ తెలంగాణ ఆస్తికి కేసీఆర్‌ ఓనర్‌ కాదని, కాపలాదారుడిగా ఉండమని అధికారం కట్టబెట్టామన్నారు. ఆయనకు సీఎం పదవి రాష్ట్ర ప్రజల ఓట్లతోనే దక్కిందన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని