నిరాధార ఆరోపణలు చేసినవారిని కోర్టుకు ఈడుస్తా

ప్రధానాంశాలు

నిరాధార ఆరోపణలు చేసినవారిని కోర్టుకు ఈడుస్తా

ఏపీ ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను

ఈనాడు, అమరావతి: ‘నాపైన, నా కుటుంబసభ్యులపైన ఆరోపణలు చేస్తున్నారు. ఇలా నిరాధార ఆరోపణలు చేసిన వారిని కోర్టుకు ఈడుస్తా. పరువునష్టం దావా వేస్తాను. పట్టాభిరామ్‌ వంటి నెల జీతగాళ్లు కాకుండా, ఎన్నికల్లో గెలిచినోళ్లో, ఓడినోళ్లో మాట్లాడాలి’ అని ఏపీ ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను విమర్శించారు. ఆదివారం ఆయన వైకాపా కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ‘మా అబ్బాయిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తీసుకురమ్మని పట్టాభి డిమాండు చేశారు. దీనికి సిద్ధం. నేనూ వస్తా. ఎక్కడో నల్గొండ జిల్లాలో గంజాయి, మద్యం కేసు నమోదైతే మాపై నిందలు వేయడం ఏమిటి? తొలుత మా పెద్దబ్బాయి అన్నారు. ఇపుడు రెండోఅబ్బాయి అంటున్నారు. మరోసారి మాపై అభాండాలు వేస్తే ఊరుకునేది లేదు’ అని హెచ్చరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని