భాజపా, తెరాసలవి కుమ్మక్కు రాజకీయాలు: తెదేపా

ప్రధానాంశాలు

భాజపా, తెరాసలవి కుమ్మక్కు రాజకీయాలు: తెదేపా

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా, తెరాసలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని, సోమవారం జరిగే భారత్‌ బంద్‌కి తెరాస ఎందుకు మద్దతు తెలపలేదో కేసీఆర్‌ చెప్పాలని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి నెల్లూరి దుర్గాప్రసాద్‌ అన్నారు. తెదేపా శ్రేణులంతా బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ఆగమేఘాల మీద కేసీఆర్‌ దిల్లీ వెళ్లి భాజపాతో సాగిస్తున్న రాజకీయాలు ప్రజలంతా గమనించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని