కరోనా బాధిత కుటుంబాల లెక్కలు తీయండి

ప్రధానాంశాలు

కరోనా బాధిత కుటుంబాల లెక్కలు తీయండి

సీఎంకు దాసోజు శ్రవణ్‌ లేఖ

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కరోనా బాధిత కుటుంబాలకు సాయం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో తెలంగాణలో కొవిడ్‌ మరణాల వాస్తవ సంఖ్యను బయటకు తీయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. మహమ్మారి కారణంగా రాష్ట్రంలో 3912 మరణాలు సంభవించినట్లు రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తుండగా.. తమకున్న సమాచారం ప్రకారం లక్షా 20 వేల మరణాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సాయానికి నిజమైన బాధితులు దూరమయ్యే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని