రాష్ట్రంలో దూషణలు.. దిల్లీలో చెట్టాపట్టాల్‌

ప్రధానాంశాలు

రాష్ట్రంలో దూషణలు.. దిల్లీలో చెట్టాపట్టాల్‌

భాజపా, తెరాస నాయకులపై మాణికం ఠాగూర్‌ విమర్శ

జహీరాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఒకరినొకరు దూషించుకుంటూ.. దిల్లీలో మాత్రం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారని భాజపా, తెరాస నాయకులను ఉద్దేశించి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ విమర్శించారు. ఆ పార్టీల నాయకులు ఇలా వ్యవహరిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, వారి చీకటి ఒప్పందాన్ని గుర్తించి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై కేసులు, దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులపై ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు. పార్టీకి కార్యకర్తలే మూలమని, అందరు కలిసికట్టుగా సాగుతూ వచ్చే ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలోని ప్రతి కార్యకర్త, ముఖ్య నాయకుల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించి పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ పరిశీలకుడు శ్రీనివాసకృష్ణన్‌, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గీతారెడ్డి, అజారుద్దీన్‌, నాయకులు  దామోదర రాజనర్సింహా, షబ్బీర్‌అలీ, సురేష్‌కుమార్‌ శెట్కార్‌, మదన్‌మోహన్‌రావు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని