ఆన్‌లైన్‌ టికెటింగ్‌తో ఆయనకేం సంబంధం?

ప్రధానాంశాలు

ఆన్‌లైన్‌ టికెటింగ్‌తో ఆయనకేం సంబంధం?

పవన్‌పై ఏపీ మంత్రి నాని ఆగ్రహం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవహారంతో నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు ఏం సంబంధమని ఏపీ సమాచార, పౌర సంబంధాలు, రవాణాశాఖ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ‘సామాన్యులకు పారదర్శకంగా, ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు సినిమా టికెట్లు అమ్మితే పవన్‌ గోలేంటి? రోజుకు నాలుగు షోలు వేయాలని చట్టం చెబుతుంటే ఇష్టమొచ్చినట్లు ప్రదర్శనలు వేస్తామంటారా..? ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తోలు తీస్తారు జాగ్రత్త’ అని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో మంత్రి విలేకర్లతో ఆదివారం మాట్లాడారు. ‘ప్రభుత్వం సినిమా టికెట్ల పోర్టల్‌ మాత్రమే నడుపుతుంది. థియేటర్ల యజమానులు ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తారు. ఒక రోజు కలెక్షన్లు.. తర్వాతి రోజు ఉదయమే రిజర్వుబ్యాంకు గేట్‌వే ద్వారా ఎవరి డబ్బులు వారికి వెళ్లిపోతాయి. ఈ వివరాలన్నీ పవన్‌ తెలుసుకున్నారా..?’ అని ప్రశ్నించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని