జగిత్యాల నుంచే ప్రగతిభవన్‌కు పోదాం

ప్రధానాంశాలు

జగిత్యాల నుంచే ప్రగతిభవన్‌కు పోదాం

బహుజన జైత్రయాత్ర సభలో డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

జగిత్యాల, న్యూస్‌టుడే: జగిత్యాల జైత్రయాత్ర స్ఫూర్తితో ఇప్పుడు జగిత్యాల బహుజన జైత్రయాత్ర ద్వారా ఏనుగెక్కి ప్రగతి భవనకు పోదామని.. గ్రామగ్రామాన గడపగడపకూ బహుజన సమాజ్‌ పార్టీని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. జగిత్యాల మినీ స్టేడియంలో ఆదివారం రాత్రి నిర్వహించిన జైత్రయాత్ర బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఇన్నాళ్లు మా బిడ్డలు అన్యాయానికి గురయ్యారని, ఇక బరాబరీ ఈ వేదిక నుంచే మాట్లాడతానన్నారు. గల్ఫ్‌ బిడ్డలకు రూ.500 కోట్ల ఇస్తామని మోసం చేశారని, గిట్టుబాటు ధర దక్కటంలేదని, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవని, 6 నెలలైనా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని విమర్శించారు. పల్లెప్రకృతి పేరుతో ఎస్సీ, ఎస్టీల భూములు లాక్కున్నారని ఆరోపించారు. ఇన్నాళ్లూ అవమానాలకు గురయ్యారని ఇక మీరంతా ఏకమై బహుజన రాజ్యం కోసం కదలిరావాలని పిలుపునిచ్చారు. జగిత్యాలతో పాటు, వివిధ జిల్లాల నుంచి భారీ సాయిలో కార్యకర్తలు హాజరయ్యారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో తొలిసారిగా జగిత్యాలలో నిర్వహించిన సభ విజయవంతం కావడంతో నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్‌ రాంజీ, రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్‌తో పాటు పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని