సీఎం సీటుపై కన్నేసింది హరీశే..

ప్రధానాంశాలు

సీఎం సీటుపై కన్నేసింది హరీశే..

ఈటల ఆరోపణ

కమలాపూర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుర్చీకి ఎసరు పెట్టాలని చూసింది ఆర్థిక మంత్రి హరీశ్‌రావేనని మాజీమంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రి కుర్చీకి ఎసరు పెడితే కేసీఆర్‌ కుమార్తె, కుమారుడు, మేనల్లుడు పెట్టాలి.. పేదోణ్ని నేనెందుకు పెడతా’ అని ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పలపల్లిలో, రాత్రి కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలోని బొంతుపల్లి గ్రామంలో నిర్వహించిన భాజపా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల దమ్మక్కపేటలోని మహిళలతో హరీశ్‌ మాట్లాడుతూ ఈటల రాజేందర్‌ ముఖ్యమంత్రి కుర్చీకే ఎసరు పెట్టారని మాట్లాడారని..  కానీ ఎసరు యత్నాలకు పాల్పడిందే ఆయన అని ఆరోపించారు.  ‘కేసీఆర్‌ భూమి మీద నడవాలంటే ప్రజలు ఆలోచించి భాజపాకు ఓటెయ్యాలి’ అని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాల్లో మాజీ ఎంపీ వివేక్‌,  సీనియర్‌ నాయకులు మహంకాళి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. బొంతుపల్లిలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు భాజపాలో చేరారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని