కేసీఆర్‌ కుటుంబ ఆస్తులను జాతీయం చేయాలి

ప్రధానాంశాలు

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులను జాతీయం చేయాలి

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌

సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రజలు మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని.. భూమి, భుక్తి, విముక్తి, హక్కుల సాధనకు ముందడుగు వేయాలని మాజీ ఐపీఎస్‌ అధికారి, బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. కేసీఆర్‌ కుటుంబ ఆస్తులను జాతీయం చేయాలని డిమాండ్‌ చేశారు. సోమవారం సిద్దిపేట బార్‌ అసోసియేషన్‌ భవనంలో నిర్వహించిన సమావేశంలో బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు రాంజీగౌతమ్‌, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్‌లతో కలిసి మాట్లాడారు. తెరాస తెలంగాణ రావుల సమితిగా మారిందని, పేదల పాలిట రాబంధుల సమితిగా మారుతోందని మంద ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు. ఏడేళ్లుగా దళితుల సంక్షేమానికి కేటాయించిన నిధులను దారి మళ్లించి హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని