ఊర్లనే బార్లుగా మారుస్తున్నారు: ఈటల

ప్రధానాంశాలు

ఊర్లనే బార్లుగా మారుస్తున్నారు: ఈటల

కమలాపూర్‌, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఊర్లనే బార్లుగా మారుస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా లారీల్లో మద్యం సీసాలు తీసుకొస్తున్నారని, ప్రజాప్రతినిధులు చేసేది ఇదేనా? అని ప్రశ్నించారు. ఈ నియోజకవర్గ గ్రామాల్లో సర్పంచులకు చెల్లిస్తున్నట్లు.. అభివృద్ధి పనుల పెండింగ్‌ బిల్లులను రాష్ట్రవ్యాప్తంగా చెల్లించగలరా? అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో సోమవారం నిర్వహించిన పెరిక కుల ఆశీర్వాద సభలో ఈటల మాట్లాడారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు రోజూ రాత్రి 11 గంటలకు పల్లెల్లో అడ్డా పెట్టి ఓట్ల కోసం బేరాలు సాగిస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో మోకాళ్ల మీద నడిచినా తెరాస గెలవదని వ్యాఖ్యానించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని