అబద్ధాలు చెప్పేవారి మాటలు చెల్లవు: ఈటల

ప్రధానాంశాలు

అబద్ధాలు చెప్పేవారి మాటలు చెల్లవు: ఈటల

జమ్మికుంట గ్రామీణం, న్యూస్‌టుడే: అబద్ధాలు చెప్పేవారి మాటలు హుజూరాబాద్‌లో చెల్లవని మాజీమంత్రి, భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలోని రామన్నపల్లి, కొత్తపల్లిలో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రజలకు తన మీద ఉన్న ప్రేమ చెక్కు చెదరడంలేదని.. తెరాస నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాత్రం తన వెంటే ఉన్నారని అన్నారు. కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ‘మా ఓటు మా వాడికే’ అనే నినాదం ఇక్కడి ప్రజల్లో కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్‌, భాజపా నాయకులు పాల్గొన్నారు.

హుజూరాబాద్‌లో తమ పార్టీ కార్యకర్తలపై అధికార తెరాస దాడులు చేస్తోందని, ఇకపై సహించే ప్రసక్తేలేదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఒక ప్రకటనలో హెచ్చరించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని