వీరప్ప మొయిలీకి రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డు

ప్రధానాంశాలు

వీరప్ప మొయిలీకి రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డు

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి డా.వీరప్ప మొయిలీని ఈ ఏడాది రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డుకు ఎంపిక చేసినట్లు రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర స్మారక కమిటీ ఛైర్మన్‌, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ తెలిపారు. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూనే సాహిత్య, సామాజిక రంగాల్లో చేస్తున్న సేవలకు గుర్తుగా ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేశామని వివరించారు. బుధవారం నిరంజన్‌ గాంధీభవన్‌లో రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర కార్యక్రమ గోడపత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. చార్మినార్‌ వద్ద ఈ నెల 19న నిర్వహించనున్న రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర కార్యక్రమానికి పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ముఖ్య నాయకులు హాజరవుతారని వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని