ఓట్లకోసం నేతలు ఏమైనా చేస్తారు

ప్రధానాంశాలు

ఓట్లకోసం నేతలు ఏమైనా చేస్తారు

లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అని.. వారి ద్వారా ఎన్నికైన వారంతా సేవకులని.. ప్రస్తుతం ఆ పరిస్థితి తారుమారైందని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్రిశాట్‌ విశ్రాంత ఉద్యోగి కనగిరి ఎస్‌ఎన్‌ ప్రసాద్‌ రాసిన ‘కొత్త రాజకీయ తత్వం: దృఢమైన సమాజాలకు సర్వరోగ నివారిణి - సమకాలీన భారతీయ రాజకీయాల్లో మలుపులు’ అనే పుస్తకాన్ని బుధవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో జేపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓట్లు తమకు పడవని తెలిస్తే కొందరు నేతలు డబ్బు, ఉచితాలు, అదీ కాకుంటే కుల, మత, ప్రాంతాల పేరుతో సమాజాన్ని ముక్కలు చేస్తున్నారని విమర్శించారు. మనమంతా రాజకీయ వ్యవస్థను ఎలా మార్చాలి, జనంలో ఎలాంటి ఆలోచన పెంచాలనే.. అంశాలతో ముందుకు వెళ్లాలని సూచించారు. సమావేశంలో పర్యావరణవేత్త బీవీ సుబ్బరాయుడు, సైన్స్‌ కమ్యూనికేటర్‌ అనిల్‌ దుబే, గాంధీ హైస్కూల్‌ అధ్యక్షుడు బి.మోహన్‌సింగ్‌, అతిథులు కె.ప్రకాష్‌ బాబు, నిర్వాహక ప్రతినిధులు వినోద్‌, టి.వివేక్‌ పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని