సోనియా నాయకత్వంపై పూర్తి విశ్వాసం: సిద్ధూ

ప్రధానాంశాలు

సోనియా నాయకత్వంపై పూర్తి విశ్వాసం: సిద్ధూ

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై తనకు పూర్తి విశ్వాసం ఉందనీ, ఆమె తీసుకున్న ఎలాంటి నిర్ణయమైనా ఆమోదయోగ్యమేనని పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూ చెప్పారు. సోనియా, రాహుల్‌, ప్రియాంక ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీకి, పంజాబ్‌కు మేలు చేసేదే అవుతుందన్నారు. పదవికి రాజీనామా చేసిన ఆయన గురువారం ఏఐసీసీ కార్యాలయంలో సీనియర్‌ నేతలతో గంటసేపు భేటీ అయ్యారు. ప్రభుత్వంలో, పార్టీలో కొన్ని నియామకాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. సిద్ధూ రాజీనామా లేఖపై శుక్రవారం పార్టీ తుది నిర్ణయం వెలువడనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు- పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌తో నూతన సీఎం చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని