కేసీఆర్‌ రాజకీయాల్ని తిప్పికొట్టాలి: ఈటల

ప్రధానాంశాలు

కేసీఆర్‌ రాజకీయాల్ని తిప్పికొట్టాలి: ఈటల

జమ్మికుంట గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న రాజకీయాల్ని ఉపఎన్నికలో తిప్పికొట్టాలని మాజీ మంత్రి, భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ పిలుపునిచ్చారు. జమ్మికుంటలోని భాజపా క్యాంపు కార్యాలయంలో గురువారం ఆటో యూనియన్‌ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘నేను వ్యవస్థతో కొట్లాడుతున్నా. ఎవరు అక్రమంగా సంపాదించారో ముందు ముందు తెలుస్తుంది. హుజూరాబాద్‌ ప్రలోభాల వలలో చిక్కుకుని మానవ సంబంధాలను ప్రశ్నిస్తోంది. ఈ వ్యవస్థ ఎటు పోతుందో చూడండి. దీనిని గాడిలో పెట్టాల్సింది మనమే. నా చివరి రక్తం బొట్టు వరకు పోరాడుతా..ఎట్టి పరిస్థితుల్లోనూ మోకరిల్లను. అంతిమ విజయం ధర్మానిదే’’ అని ఈటల అన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని