ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా

ప్రధానాంశాలు

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా

నిరుద్యోగులకు బండి సంజయ్‌ హామీ

ఈనాడు, హైదరాబాద్‌: సమగ్ర శిక్ష అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ)లో 704 పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే ఈ సమస్య పరిష్కారమయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు. ఎస్‌ఎస్‌ఏ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం సంజయ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఐఈఆర్‌పీ, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌, సిస్టమ్‌ అనలిస్ట్‌, అసిస్టెంట్‌ ప్రోగ్రామర్‌ తదితర 704 పోస్టుల భర్తీకి జూన్‌ 11, 2019న ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిందని, అదే ఏడు డిసెంబరు 23న పరీక్ష నిర్వహించిందని వారు వివరించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని