తెరాసలోకి మోత్కుపల్లి

ప్రధానాంశాలు

తెరాసలోకి మోత్కుపల్లి

రేపు తెలంగాణభవన్‌లో పార్టీ కండువా కప్పనున్న సీఎం

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ రాష్ట్రసమితిలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆలేరు శాసనసభ నియోజకవర్గం నుంచి అయిదుసార్లు, తుంగతుర్తి నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన నర్సింహులు రెండేళ్ల క్రితం భాజపాలో చేరారు. తనకు గుర్తింపు లేదనే అసంతృప్తితో ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయగా...దానికి హాజరుకావడం లేదని భాజపా తెలిపినా మోత్కుపల్లి పాల్గొని దళితబంధుకు మద్దతు తెలిపారు. భాజపా నేతలు సంజాయిషీ అడగడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. అప్పట్నుంచే ఆయన తెరాసలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని