ముదిరాజ్‌లు అభివృద్ధి సాధించాలి

ప్రధానాంశాలు

ముదిరాజ్‌లు అభివృద్ధి సాధించాలి

కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి

బన్సీలాల్‌పేట్‌, న్యూస్‌టుడే: ముదిరాజ్‌లు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి ఆకాంక్షించారు. సికింద్రాబాద్‌ న్యూబోయిగూడలోని ముదిరాజ్‌భవన్‌లో ముదిరాజ్‌ మహాసభ వసంతోత్సవాలు ఆదివారం జరిగాయి. అఖిల భారతీయ ముదిరాజ్‌, కోళి సమాజ్‌ అధ్యక్షులు గుజరాత్‌ ఎమ్మెల్యే కువార్జీ భావాలియా, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్‌ మహాసభ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సాధ్వి నిరంజన్‌ జ్యోతి మాట్లాడుతూ.. మహాసభను స్థాపించిన కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్‌ సేవలను కొనియాడారు. ముదిరాజ్‌లంతా ఐక్యంగా ఉండాలని కోరారు. వారి సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కువార్జీ భావాలియా మాట్లాడుతూ.. ముదిరాజ్‌, కోళిలు రాష్ట్రాల వారీగా హక్కుల సాధనకు చేసే ఉద్యమానికి జాతీయస్థాయిలో అండగా ఉంటామన్నారు. కాసాని జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతూ.. ముదిరాజ్‌లను బీసీ డి గ్రూప్‌ నుంచి ఎ గ్రూప్‌నకు మార్చే డిమాండ్‌పై నివేదికను సుప్రీంకోర్టుకు పంపడంలో తెలంగాణ ప్రభుత్వం జాప్యం చేస్తోందని ధ్వజమెత్తారు. డిసెంబరు 20లోపు ఆ నివేదిక పంపకపోతే సత్తా చాటుతామన్నారు. అంతకుముందు కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్‌, నవాడ ముత్తయ్య చిత్రపటాలకు అతిథులు నివాళి అర్పించారు. కార్యక్రమంలో మహాసభ నేతలు సదానంత్‌, రావుల జగదీశ్వర్‌ప్రసాద్‌, నీలం శ్రీనివాస్‌, వెంకటేశ్‌, వీరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని