నేడు హుజూరాబాద్‌లో మాణికం ఠాగూర్‌ ప్రచారం

ప్రధానాంశాలు

నేడు హుజూరాబాద్‌లో మాణికం ఠాగూర్‌ ప్రచారం

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ ఈ నెల 18న సోమవారం హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు మద్దతుగా ఆయన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జమ్మికుంట పట్టణంలోని గాంధీచౌక్‌ వద్ద ప్రచారం నిర్వహిస్తారు. అదే విధంగా నియోజకవర్గం ఎన్నికల ఇన్‌ఛార్జీలు, మండల చీఫ్‌ కో ఆర్డినేటర్లు, గ్రామ ఇన్‌ఛార్జిలతో సమావేశమవుతారు. తాజా రాజకీయ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తారు. మహిళల సమావేశంలోనూ ఠాగూర్‌ పాల్గొంటారు. ఆయనతో పాటు ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్‌ కృష్ణన్‌, కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు ప్రచారంలో పాల్గొననున్నారు.

హరీశ్‌ పదవికి రాజీనామా చేసి ప్రచారంలో పాల్గొనాలి

మంత్రి హరీశ్‌రావు తన పదవికి రాజీనామా చేసి హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయెల్‌కు కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి ఆదివారం లేఖ రాశారు. ఆర్థికమంత్రిగా ఉన్న హరీశ్‌ నెల రోజులుగా ప్రచారంలో పాల్గొనడం ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తుందన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని