రైతుల ఇబ్బందులను పట్టించుకోని సీఎం: ఈటల

ప్రధానాంశాలు

రైతుల ఇబ్బందులను పట్టించుకోని సీఎం: ఈటల

హుజూరాబాద్‌ పట్టణం, గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని రైతుల ఇబ్బందులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టించుకోవటం లేదని మాజీమంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. హుజూరాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని బోర్నపల్లి, కొత్తపల్లి మండలంలోని పోతిరెడ్డిపేట, వెంకట్రావుపల్లిలో ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలతో చేతికందిన ధాన్యం దెబ్బతింటోందని...వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న తెరాస కేవలం మాటలకే పరిమితమైందని, చేతల్లో మాత్రం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని చెబుతున్న సీఎం, మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ రాయితీ నేటికీ విడుదల చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, నేతలు మాసాడి ముత్యంరావు, రాముల కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని