గెలిస్తే ఏం చేస్తారో ఈటల చెప్పాలి

ప్రధానాంశాలు

గెలిస్తే ఏం చేస్తారో ఈటల చెప్పాలి

ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నిలదీత

వీణవంక, న్యూస్‌టుడే: మంత్రిగా ఉండి హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయని ఈటల ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికలో గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి, ఇప్పలపల్లి, ఎలబాక, గంగారం, కొండపాక, శ్రీరాములపేట, కిష్టంపేట గ్రామాల్లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...పేదలు, అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం అనేక పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. అవి దండగ అని అంటున్న ఈటలను ఓడించాలని పిలుపునిచ్చారు. కారు గుర్తుతో ఆరుసార్లు గెలిచిన ఈటల ఒక్క పేదవాడికి ఇల్లు నిర్మించి ఇవ్వలేదని... ఈటల రాజేందర్‌ ప్రజల సమస్యల కోసం రాజీనామా చేయలేదని, తన స్వార్థం కోసం చేశాడని అన్నారు. ఎంపీగా బండి సంజయ్‌ గెలిచి రెండేళ్లు పూర్తయినా ఒక్కపైసా పని చేయలేదన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు  గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తానే తీసుకుంటానని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, వెంకటవీరయ్య తదితరులు ఉన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని