ఉప ఎన్నికలో కాళేశ్వరం అవినీతి సొమ్ము పంపిణీ

ప్రధానాంశాలు

ఉప ఎన్నికలో కాళేశ్వరం అవినీతి సొమ్ము పంపిణీ

మాణికం ఠాగూర్‌ ఆరోపణ

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తెరాస డబ్బుల్ని ఏరులై పారిస్తోందని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో సంపాదించిన అవినీతి సొమ్మును ఖర్చు పెడుతోందని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ ఆరోపించారు. సోమవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రూ.కోట్లు పంచుతున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని ఠాగూర్‌ విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్‌ కృష్ణన్‌, మధుయాస్కీ,  మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని