ఆ అక్రమ నిర్మాణాలపై చర్యలు ఉంటాయా?: రేవంత్‌

ప్రధానాంశాలు

ఆ అక్రమ నిర్మాణాలపై చర్యలు ఉంటాయా?: రేవంత్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని ఉప్పల్‌ కలాన్‌లో అక్రమ నిర్మాణాలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. మీ శాఖ బాగోతాలపై చర్యలుంటాయా? లేదా అంటూ నిలదీశారు. సీఎంవో, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లను రేవంత్‌రెడ్డి ట్విటర్‌లో ట్యాగ్‌ చేశారు.

నేడు రాజీవ్‌గాంధీ సద్భావన సమావేశం

రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర స్మారక కమిటీ ఆధ్వర్యంలో నేడు (మంగళవారం) ఉదయం 10.30 గంటలకు చార్మినార్‌ వద్ద సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా కర్ణాటక మాజీ సీఎం వీరప్ప మొయిలీకి సద్భావన పురస్కారం అందజేస్తారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని