తెరాస అబద్ధాలను నమ్మొద్దు

ప్రధానాంశాలు

తెరాస అబద్ధాలను నమ్మొద్దు

మాజీ మంత్రి ఈటల

వీణవంక, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తెరాస నేతలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. సోమవారం ఆయన కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం గంగారం, ఎలబాక, మామిడాలపల్లి, ఇప్పలపల్లి, చల్లూరు గ్రామాల్లో పర్యటించారు. భాజపాకు ఓట్లు వేస్తే పింఛన్లు, దళితబంధు రావంటున్నారని.. అటువంటి దుష్ప్రచారాలను  నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చిన తెరాస ఎమ్మెల్యేలు, మంత్రులు వారి నియోజకవర్గాల్లో ఎటువంటి అభివృద్ధి చేయడంలేదని విమర్శించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ.. ‘‘భాజపా గెలిస్తే మోటార్లకు మీటర్లు పెడతారని.. పింఛన్లు రావని తెరాస నేతలు అంటున్నారు. కాని దుబ్బాకలో నేను గెలిచి పది నెలలైంది. అక్కడ మోటార్లకు మీటర్లు పెట్టలేదు. పింఛన్లు ఆగలేదు’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్‌, రవీందర్‌రెడ్డి, అశ్వత్థామరెడ్డి, చొప్పరి జయశ్రీ పాల్గొన్నారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని