త్వరలో కొత్త పార్టీ.. భాజపాతో పొత్తు

ప్రధానాంశాలు

త్వరలో కొత్త పార్టీ.. భాజపాతో పొత్తు

అమరీందర్‌ సింగ్‌ ప్రకటన

దిల్లీ: త్వరలో కొత్త పార్టీ ప్రకటిస్తానని, భాజపాతో పొత్తు కూడా ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ నేత, పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ మంగళవారం ప్రకటించారు. ఏడాదిగా కొనసాగుతున్న రైతుల ఆందోళన సానుకూలంగా పరిష్కారమైనపుడే పొత్తు సాధ్యమవుతుందన్నారు. పంజాబ్‌ కాంగ్రెస్‌లో పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌సింగ్‌ సిద్ధూతో పొసగక, నెలరోజుల క్రితం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అమరీందర్‌ భాజపా నేతలతో సన్నిహితంగా ఉంటున్న విషయం తెలిసిందే. ‘పంజాబ్‌ భవిత కోసం యుద్ధం మొదలైంది. నా రాష్ట్రం, నా ప్రజల భవిష్యత్తును కాపాడుకునేదాకా నిద్రపోను’ అని అమరీందర్‌ ప్రకటించారు. రైతుల సమస్య సానుకూలంగా పరిష్కారమైతే.. 2022 పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, అకాలీ గ్రూపుల వంటి మిత్రపక్షాలతో పొత్తులు పెట్టుకుంటామని తెలిపారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని