చైనా చొరబాటుపై ప్రధాని మౌనమేల: అసదుద్దీన్‌

ప్రధానాంశాలు

చైనా చొరబాటుపై ప్రధాని మౌనమేల: అసదుద్దీన్‌

అబిడ్స్‌, న్యూస్‌టుడే: ‘భారత భూభాగంలోకి చైనా చొచ్చుకువస్తున్నా ప్రధాని మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారు? పాకిస్థాన్‌ నుంచి తీవ్రవాదులు కశ్మీరులోకి ప్రవేశించి ప్రజలు, సైనికుల ప్రాణాలు తీస్తుంటే ఆ దేశంతో క్రికెట్‌ మ్యాచ్‌ అవసరమా?’ అని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని దారుస్సలాంలో మంగళవారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. దేశ భద్రత విషయంలో ప్రధాని మోదీ వైఖరేమిటి? చైనా అంటే ఆయనకు ఎందుకంత భయం? అని ప్రశ్నించారు. నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సమాధానం చెప్పాలని కోరారు. ముస్లింల హక్కుల సాధనకు దేశం నలుమూలలా పర్యటించి చైతన్యం తీసుకువస్తానని అసదుద్దీన్‌ తెలిపారు. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఎంఐఎంను విస్తరించడంతో పాటు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకై నిలుస్తానన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీ సర్కారును ఓడించేందుకు ప్రత్యేక ప్రణాళికతో సాగుతున్నట్లు తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని