‘పథకాన్ని’ అడ్డుకుంటే పుట్టగతులుండవు: మోత్కుపల్లి

ప్రధానాంశాలు

‘పథకాన్ని’ అడ్డుకుంటే పుట్టగతులుండవు: మోత్కుపల్లి

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: దళితుల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని అడ్డుకునే పార్టీలకు పుట్టగతులు ఉండవని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఈటల రాజేందర్‌ కోసం పథకాన్ని ఆపి దళితుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో మంగళవారం విలేకరుల సమావేశంలో మోత్కుపల్లి మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్‌ను బలహీనపరిచేందుకు కాంగ్రెస్‌, భాజపా నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దళిత బంధును ఆపినంత మాత్రాన హుజూరాబాద్‌లో తెరాస గెలుపును అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని