దళితబంధుపై సీఎంకు చిత్తశుద్ధి లేదు

ప్రధానాంశాలు

దళితబంధుపై సీఎంకు చిత్తశుద్ధి లేదు

పోచమ్మగుడికి తడి దుస్తులతో వస్తా.. మీరొస్తారా కేసీఆర్‌?
పసుపు, కుంకుమతో వస్తా.. నువ్వొస్తావా హరీశ్‌: ఈటల

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: ఎన్నికల కోడ్‌ వస్తుందని ముందే తెలిసి దళిత బంధు పథకాన్ని అమలు చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాప్యం చేశారని మాజీ మంత్రి, హుజూరాబాద్‌ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. పథకంపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని.. ఒకవేళ ఉంటే పథకాన్ని ప్రారంభించి 70 రోజులైనా ఎందుకు అందరికీ అందించలేదో ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే తప్పును ఒప్పుకొని ముక్కునేలకు రాయాలని కోరారు. మంగళవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. ‘‘దళితబంధు వద్దు అని నేను లేఖ రాసినట్టు నిరూపిస్తావా.. కేసీఆర్‌.. చెల్పూర్‌ పోచమ్మ గుడికి తడి దుస్తులతో నేనొస్తాను.. మీరొస్తారా’ అంటూ సీఎంకు ఈటల సవాలు విసిరారు. అదే సమయంలో ‘‘పసుపు కుంకుమ చేతుల్లో పట్టుకుని ఆలయానికి నేనొస్తాను.. నువ్వొస్తావా.. హరీశ్‌’’ అంటూ నిలదీశారు. ‘దళితబంధు’ను నేను వద్దన్నట్లు కేసీఆరే దొంగ ఉత్తరం సృష్టించార[ని ఆరోపించారు. తన నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఇప్పటికే ఎన్నికల అధికారులు స్పష్టం చేసిన విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. అయినప్పటికీ రాత్రికి రాత్రి కొత్తనాటకానికి కేసీఆర్‌ తెరతీశార[ని విమర్శించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని