తెలంగాణలో తిరగనివ్వకుండా చేస్తాం

ప్రధానాంశాలు

తెలంగాణలో తిరగనివ్వకుండా చేస్తాం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ కుమ్మక్కయ్యాయని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు బక్కని నర్సింహులు, పార్టీ అధికార ప్రతినిధి నెల్లూరు దుర్గాప్రసాద్‌లు ధ్వజమెత్తారు. ఇక ఆ రాష్ట్ర ప్రజలకు దిక్కెవరన్నారు. డ్రగ్‌ మాఫియా అని విమర్శిస్తే ఏపీ ముఖ్యమంత్రికి ఎందుకంత కోపమని ప్రశ్నించారు. ‘‘వ్యక్తిగతంగా భావించి భౌతిక దాడులకు దిగితే హైదరాబాద్‌లోని మీ ఆస్తుల్ని కాపాడుకోగలరా..? తెలంగాణ తెదేపా శ్రేణుల నుంచి తప్పించుకోగలరా..? తెలంగాణలో తిరగనివ్వకుండా చేస్తాం. చంద్రబాబు సహనమే మిమ్మల్ని కాపాడుతోంది’’ అని వైకాపా నేతలనుద్దేశించి అన్నారు. బుధవారం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.


అవి రాజ్యాంగంపై చేసిన దాడులు: తెదేపా

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కార్యాలయాలు, నేతల ఇళ్లపై వైకాపా శ్రేణుల దాడులు కేవలం పార్టీపై జరిగినవి కావని, రాజ్యాంగంపై, భావ ప్రకటనా స్వేచ్ఛపై చేసినవని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి అన్నారు. బుధవారం ఎన్టీఆర్‌భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని