పన్నుల పేరిట సర్కారు దోపిడీ: బండి

ప్రధానాంశాలు

పన్నుల పేరిట సర్కారు దోపిడీ: బండి

కమలాపూర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని కేసీఆర్‌ ప్రభుత్వం పన్నుల పేరుతో ప్రజల నుంచి రూ. వేల కోట్లు  దోచుకుంటోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ఆరోపించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం శనిగరం, కమలాపూర్‌ గ్రామాల్లో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ తరఫున ఆయన ప్రచారం చేశారు. పన్నుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో లీటరు పెట్రోల్‌పై రూ.41 దోచుకుంటోందన్నారు. ఆ సొమ్మును మినహాయిస్తే ప్రజలకు రూ.60కే లీటరు పెట్రోల్‌ ఇవ్వచ్చన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఈ పన్నులను మినహాయించాలని సవాల్‌ విసిరారు. దేశంలో అత్యంత అవినీతిపరుడు కేసీఆరేనని ఆరోపించారు. దళితులంతా ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని కోరారు. కమలం గుర్తుకు ఓటెయ్యాలని ప్రజలను కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని