భాజపా, తెరాసకు ఓటు అడిగే హక్కు లేదు: ఉత్తమ్‌

ప్రధానాంశాలు

భాజపా, తెరాసకు ఓటు అడిగే హక్కు లేదు: ఉత్తమ్‌

జమ్మికుంట గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజలకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన భాజపా, తెరాసకు హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఓటు అడిగే నైతిక హక్కు లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం బూజునూర్‌, రాచపల్లి, మల్లన్నపల్లి, వంతడుపుల గ్రామాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేస్తున్న భాజపాకు, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన తెరాసకు ఉప ఎన్నికలో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని బల్మూరి వెంకట్‌ విమర్శించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని