ప్రభుత్వరంగ సంస్థల్ని కాపాడుకుంటాం: ఆర్‌.కృష్ణయ్య

ప్రధానాంశాలు

ప్రభుత్వరంగ సంస్థల్ని కాపాడుకుంటాం: ఆర్‌.కృష్ణయ్య

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: దేశాన్ని పాలించేందుకు ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చారే తప్ప ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించేందుకు కాదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. వాటిని కాపాడుకుంటామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ లక్డీకాపూల్‌లో జాతీయ, రాష్ట్ర ఓబీసీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రైల్వే, బ్యాంకులు, ఎల్‌ఐసీ, రక్షణ రంగాలను ప్రైవేటుపరం చేసే అధికారం కేంద్రానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు.  జనాభా లెక్కల్లో కుల గణన చేపట్టకపోతే వచ్చే ఎన్నికల్లో భాజపాకు వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తామన్నారు. సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో కార్మిక కోడ్‌ ఎత్తేసే ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ నేత వీహీచ్‌ మాట్లాడుతూ ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును అమ్మేశారని, పట్టించుకోకుంటే బీహెచ్‌ఈఎల్‌నూ అమ్మేస్తారని అన్నారు. ఆత్మనిర్భర్‌ పేరిట అదానీ, అంబానీలకు దేశ సంపద కట్టబెడుతున్నారని మాజీ ఎంపీ అజీజ్‌ పాషా ఆరోపించారు. బీసీ ఉద్యోగుల సంఘం నేతలు దానకర్ణాచారి, సురేందర్‌, వెంకన్నగౌడ్‌, నిరంజన్‌, కృష్ణుడు, గుజ్జకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని