ఖాదీ విడవను.. మద్యం తాగను

ప్రధానాంశాలు

ఖాదీ విడవను.. మద్యం తాగను

సభ్యత్వం పొందేందుకు కాంగ్రెస్‌ నిబంధనలు

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వం పొందాలనుకునే వారు వ్యక్తిగతంగా పది సూత్రాలను పాటించాల్సి ఉంటుంది. ఖాదీని ధరించడంతో పాటు, మద్యం తాగకపోవడం కూడా ఇందులో ప్రధానమైనవి. పార్టీ సమావేశాల్లో తప్ప బహిరంగ వేదికలపై పార్టీని, కార్యక్రమాలను విమర్శించబోనని చెప్పడం కూడా ముఖ్యమైనది. సభ్యత్వం తీసుకునే వారు ఈమేరకు స్వీయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. చట్టబద్ధమైన పరిమితుల్లో తప్పించి ఇతరత్రా ఆస్తులు సంపాదించలేదని కూడా పేర్కొనాల్సి ఉంటుంది. ‘‘గుర్తింపు పొందిన ఖాదీని ధరించడం నాకు అలవాటు; మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగం నుంచి దూరంగా ఉంటున్నా; సామాజిక వివక్షను, అసమానతలను పాటించను; సమాజంలోని ఇలాంటి వైపరీత్యాలను తొలగించడానికి పనిచేస్తా; శారీరక శ్రమ సహా వర్కింగ్‌ కమిటీ ఇచ్చే అన్ని బాధ్యతలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నా’’ అని పేర్కొంటూ స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. శాంతియుత, రాజ్యాంగ, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో దేశ అభివృద్ధి సాధించాల్సి ఉన్న దృష్ట్యా సభ్యులు ఈ విధానాలను అమలు చేయాల్సి ఉంటుందని పార్టీ తెలిపింది. నవంబరు 1న సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని కాంగ్రెస్‌ పార్టీ సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని