రెండుసార్లు సీఎం పదవిస్తే ఒక్క హామీనీ నెరవేర్చలేదు: షర్మిల

ప్రధానాంశాలు

రెండుసార్లు సీఎం పదవిస్తే ఒక్క హామీనీ నెరవేర్చలేదు: షర్మిల

మహేశ్వరం, శంషాబాద్‌, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడతానని వైతెపా అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం తప్ప మరే వర్గం సంతోషంగా లేదన్నారు. కేసీఆర్‌కు రెండుసార్లు సీఎం పదవిని కట్టబెట్టినప్పటికీ ఒక్క హామీనీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర శనివారం రాత్రి రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని పెద్దగోల్కొండ గ్రామం నుంచి మహేశ్వరం మండలం నాగారం గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పెద్దగోల్కొండ గ్రామస్థులతో ఆమె మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. భర్త చనిపోయి ఒంటరిగా జీవిస్తున్న ఓ మహిళకు షర్మిల రూ.15 వేలు అందజేశారు. ఆమె నాగారం సమీపంలో రాత్రి బస చేశారు. అంతకుముందు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని గొల్లపల్లి, రషీద్‌గూడ, పోశెట్టిగూడ, చిన్నగోల్కొండ, బహదూర్‌గూడ, పెద్దగోల్కొండ తదితర గ్రామాల మీదుగా పాదయాత్ర చేశారు. ఆదివారం మహేశ్వరం కూడలిలో ఏర్పాటు చేసే బహిరంగసభలో షర్మిల మాట్లాడనున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని