అప్పట్లో బహిరంగంగానే కలిశాం.. తప్పేంటి?

ప్రధానాంశాలు

అప్పట్లో బహిరంగంగానే కలిశాం.. తప్పేంటి?

కేటీఆర్‌ వ్యాఖ్యలపై రేవంత్‌, ఈటల స్పందన

ఈనాడు, కరీంనగర్‌ డిజిటల్‌: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌, భాజపాలు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని, తాము గోల్కొండ రిసార్ట్‌లో రహస్యంగా కలుసుకున్నామని మంత్రి కేటీఆర్‌ చేసిన ఆరోపణలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, హుజూరాబాద్‌ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌లు వేర్వేరు చోట్ల స్పందించారు. శనివారం హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రచారంలో వారు మాట్లాడారు. ‘‘మంత్రి కేటీఆర్‌ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నేను ఈటలను గోల్కొండ రిసార్ట్‌లో వేలమంది సమక్షంలో కలిశాను. ఆ విషయం అందరికీ తెలుసు. మే 7న వేం నరేందర్‌రెడ్డి ఇంట్లో శుభకార్యంలో అందరిముందు కలిశాం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘‘తెరాస ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే, 4నెలల కింద రేవంత్‌రెడ్డిని కలిశాను. అందులో తప్పేంటి? అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అన్ని పార్టీల నేతలను కలిశాను. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ అన్నిపార్టీల మద్దతు కూడగట్టలేదా? అన్ని జాతీయ పార్టీల నేతలను కలవలేదా? గతంలో నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులను కలిసే సంస్కృతి ఉండేది. కేసీఆర్‌ సీఎం అయ్యాక అది పోయింది. అన్ని పార్టీల నాయకులతో ఎప్పటికప్పుడు మాట్లాడుకునే సంప్రదాయం ఉండాలి’’అని రాజేందర్‌ పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని