హుజూరాబాద్‌లో తెరాస విజయం ఖాయం

ప్రధానాంశాలు

హుజూరాబాద్‌లో తెరాస విజయం ఖాయం

కాంగ్రెస్‌, భాజపాల చీకటి ఒప్పందాన్ని ప్రజలు తిప్పికొడతారు
ప్లీనరీకి ప్రతినిధులు గులాబీ దుస్తులతో రావాలి

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా, కాంగ్రెస్‌లు కుమ్మక్కై లోపాయికారీ ఒప్పందాలతో ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్‌లో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ ఘనవిజయం సాధిస్తారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు తెలిపారు. గోల్కొండ రిసార్ట్స్‌లో ఈటల రాజేందర్‌, రేవంత్‌రెడ్డి రహస్యంగా కలిసింది నిజమా?కాదా? స్పష్టం చేయాలన్నారు. లేకపోతే తానే ఆధారాలు బయటపెడతానన్నారు.మాణికం ఠాగూర్‌ పీసీసీ అధ్యక్ష పదవిని రూ. 50 కోట్లకు అమ్ముకున్నారని ఆ పార్టీ నేతలు చేసిన విమర్శలపైనే ఇప్పటివరకు స్పందించలేదని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలు ఉన్న వ్యక్తులకు కాంగ్రెస్‌ అగ్ర తాంబూలం ఇస్తోందని... కాంగ్రెస్‌లో పనిచేసిన సీనియర్‌ నాయకుడు, పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌ విమర్శలకూ ఆ పార్టీ నుంచి సమాధానం లేదని పేర్కొన్నారు. శనివారం ఆయన హెచ్‌ఐసీసీలో తెరాస ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి మల్లారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాంధీ, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్‌లు ఆయన వెంట ఉన్నారు. అనంతరం కేటీఆర్‌ విలేకరులతో మాట్లాడారు. ‘‘తెరాస ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని రకాల సౌకర్యాలు కల్పించాం. ఈ నెల 25న జరగనున్న ప్లీనరీకి వచ్చే పురుష ప్రతినిధులు గులాబీ రంగు చొక్కాలు, మహిళలు గులాబీ రంగు చీరలు ధరించాలి. పార్టీ ఎంపిక చేసిన ప్రజాప్రతినిధులకు ఇప్పటికే ఆహ్వానాలు, పాస్‌లు పంపించాం. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, జడ్పీ మాజీ ఛైర్మన్లతో పాటు పార్టీ ముఖ్యులను నియోజకవర్గాల వారీగా ఆహ్వానించాం.

జాతీయ రాజకీయాలను శాసించేస్థాయికి
తెలంగాణ రాష్ట్రసమితి ఉద్యమ సంస్థగా ఆవిర్భవించి రాష్ట్ర సాధనే లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చింది. బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేడ్కర్‌ తత్వాన్ని పూర్తి స్థాయిలో ఆచరణలో పెట్టి లక్ష్యాన్ని చేరుకున్నాం. ఇప్పుడు భారతదేశానికే తెలంగాణ దిక్సూచిగా మారింది. జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి చేరాం. ఇక్కడి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయని ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశంసిస్తున్నారు’’ అని కేటీఆర్‌ తెలిపారు. 


ముగిసిన 105 నియోజకవర్గాల సమీక్షలు

మ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలు, ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ నేతలతో కేటీఆర్‌ శనివారం సమీక్ష నిర్వహించారు. వీటితో 105 నియోజకవర్గాల సమీక్షలు పూర్తయ్యాయి. మిగిలిన నియోజకవర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హుజూరాబాద్‌ ప్రచారంలో ఉన్నారు. వీరితో నవంబరు 5న సమీక్షించే అవకాశం ఉంది. విజయగర్జన సభపై ఈ నెల 27న అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు జరగనున్నాయి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని