తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచాలి

ప్రధానాంశాలు

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచాలి

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: జమ్ము, కశ్మీర్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల పునర్విభజన జరపాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని ఆయన సూచించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జమ్ము, కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా శాసనసభ స్థానాలు పెంచేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసిందన్నారు. దీనిని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శనివారం అధికారికంగా ప్రకటించారని తెలిపారు. ఒకే దేశం, ఒకే చట్టం విధానాన్ని కేంద్రం అమలు చేయాలని ఆయన కోరారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని