సీఎం సభకు అనుమతి కోసం ఎన్నికల సంఘానికి తెరాస లేఖ

ప్రధానాంశాలు

సీఎం సభకు అనుమతి కోసం ఎన్నికల సంఘానికి తెరాస లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేటలో సీఎం కేసీఆర్‌ సభకు అనుమతించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతూ తెరాస ఆదివారం లేఖ రాసింది. గతంలో హుస్నాబాద్‌లో భాజపా సభ జరిగిందని, అదే తరహాలో అనుమతి ఇవ్వాలంది. పెంచికల్‌పేటలో అవకాశం ఇవ్వని పక్షంలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని రెండు లేదా మూడు మండలాల్లో సీఎం ప్రచారానికి అనుమతించాలంది. సోమవారం ఎన్నికల సంఘం అభిప్రాయం తెలిపే వీలుందని, దానికి అనుగుణంగా కేసీఆర్‌ ప్రచార కార్యక్రమం ఉండే అవకాశాలున్నాయని తెరాస వర్గాలు తెలిపాయి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని