ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర

ప్రధానాంశాలు

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

మంచిర్యాల పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడానికి మోదీ నేతృత్వంలోని సర్కారు కుట్ర చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మంచిర్యాలలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రక్షణ, రైల్వే, విమాన రంగాలను కూడా ప్రైవేటీకరించి కార్పొరేట్‌ సంస్థలకు లాభం చేకూర్చడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సముద్ర మార్గం గుండా హెరాయిన్‌, గంజాయి తదితరాలు అక్రమంగా రవాణా అవుతున్నాయన్నారు. ఏపీలో తెదేపా కార్యాలయం, ఆ పార్టీ నాయకుల ఇళ్లపై దాడులను ఖండిస్తున్నామని తెలిపారు. దిల్లీ వెళ్లడానికి సిద్ధమైన తెదేపా బృందం సభ్యులు 356 ఆర్టికల్‌ అమలు చేయాలని కోరితే వ్యతిరేకిస్తామన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని