సహ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్ర: భాజపా

ప్రధానాంశాలు

సహ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్ర: భాజపా

ఈనాడు, హైదరాబాద్‌: సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని భాజపా నేత గూడూరు నారాయణరెడ్డి అన్నారు. ప్రభుత్వ అనుమతితోనే సమాచారం ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ని కోర్టుకు లాగుతామని చెప్పారు. పలు పథకాల్లో తెరాస నేతల అవినీతి, అవకతవకలు బయటపడుతుండటంతో ప్రభుత్వం భయపడి అణచివేత చర్యలకు దిగుతోందన్నారు. ఈమేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని