తెరాస అధ్యక్ష పదవి దళితులకివ్వాలి

ప్రధానాంశాలు

తెరాస అధ్యక్ష పదవి దళితులకివ్వాలి

భాజపా రాష్ట్రాధ్యక్షుడు సంజయ్‌ డిమాండ్‌

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: ఇరవై ఏళ్లపాటు కేసీఆర్‌ ఒక్కరే తెరాసకు అధ్యక్షుడిగా ఉండటం ఎంతవరకు సమంజసమని, ఆయనకు దళితులపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే అధ్యక్ష పదవిలో ఆ సామాజికవర్గం నాయకుడిని నియమించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలో కనీసం ఆ స్థాయికి తగిన దళిత నాయకులు లేరా? అని ప్రశ్నించారు. కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లిలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం ఎందరో అమరులయ్యారని, వారి బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే.. కేసీఆర్‌ కుటుంబీకులు పదవులను అనుభవిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలపై కుటుంబ పాలనను రుద్దుతున్నారన్నారు. హుజూరాబాద్‌ ఎన్నికల్లో ఎలాగూ ఓడిపోతామనే ఉద్దేశంతో తెరాస ప్లీనరీని ఏర్పాటు చేశారన్నారు. దుబాయ్‌లో బతుకమ్మ ఆడుతూ కేసీఆర్‌ ఫొటోను పెట్టడం శోచనీయమన్నారు. పోడు భూములపై ముఖ్యమంత్రి కొత్త డ్రామాలు ఆడుతున్నారన్నారు. బాలింత అని చూడకుండా మహిళను జైలుకు పంపిన వ్యక్తి కేసీఆర్‌ అని విమర్శించారు. తెరాస ఇక్కడ ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా ప్రజలు ఈటలనే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని