తెరాస శ్రేణుల వినూత్న ప్రచారం

ప్రధానాంశాలు

తెరాస శ్రేణుల వినూత్న ప్రచారం

హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో తెరాస నేతలు, కార్యకర్తలు సోమవారం వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. ప్లైవుడ్‌తో గ్యాస్‌సిలిండర్‌ను తయారు చేసి కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ ధరలు అడ్డూఅదుపూ లేకుండా పెంచుతోందని ఆరోపిస్తూ ప్రచారం నిర్వహించారు. కొందరు తెరాస కార్యకర్తలు వాటితో ద్విచక్రవాహనాలపై ప్రధాన రహదారులు, వీధుల్లో ప్రదర్శన చేయగా మహిళా కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉపఎన్నికలో తెరాస అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. 

- న్యూస్‌టుడే, కమలాపూర్‌

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని