తెరాస, భాజపాలకు గుణపాఠం చెప్పండి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ప్రధానాంశాలు

తెరాస, భాజపాలకు గుణపాఠం చెప్పండి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

దేశరాజుపల్లిలో మాట్లాడుతున్న ఉత్తమ్‌, పక్కన అభ్యర్థి వెంకట్, భట్టి విక్రమార్క

కమలాపూర్‌, న్యూస్‌టుడే: కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపా, తెరాసలు దోపిడీ చేసేవని, వాటికి గుణపాఠం చెప్పాలని ఓటర్లకు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం దేశరాజుపల్లి, కానిపర్తి, శంభునిపల్లి, కమలాపూర్‌ గ్రామాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూర్‌ వెంకట్తో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో పలుమార్లు గెలిచినప్పటికీ ఈటల రాజేందర్‌ గ్రామాల్లో చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. అన్ని వర్గాలను తెరాస మోసం చేసిందన్నారు. భాజపా అభ్యర్థికి ఓటేస్తే పెంచిన డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ సిలిండర్‌ ధరలను అంగీకరించినట్లేనన్నారు. తెరాసకు మద్దతిస్తే రూ.లక్షల కోట్ల దోపిడీని సమర్థించినట్లేనన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేసీఆర్‌, ఈటల రాజేందర్‌ మధ్య దోపిడీ సొమ్ము పంచాయితీలో భాగంగా ఉప ఎన్నిక వచ్చిందన్నారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌, ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని