ఏం సాధించారని ప్లీనరీ?: ప్రవీణ్‌కుమార్‌

ప్రధానాంశాలు

ఏం సాధించారని ప్లీనరీ?: ప్రవీణ్‌కుమార్‌

మెదక్‌ టౌన్‌, న్యూస్‌టుడే: బహుజనుల ఆత్మ బలిదానాలతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది తప్ప సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ వల్ల కాదని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. మెదక్‌ పట్టణంలోని ఓ గార్డెన్స్‌లో పార్టీ ఆధ్వర్యంలో బహుజనుల స్వయం పాలన ప్రతిజ్ఞ సదస్సు మంగళవారం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ట్ర సాధనకు శ్రీకాంతాచారి, వేణుగోపాల్‌, ఇషాంత్‌, బోజ్యనాయక్‌ వంటి ఎంతో మంది తమ ప్రాణాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఏం సాధించారని తెరాస అధినాయకులు ప్లీనరీ నిర్వహించారని ప్రశ్నించారు. వరి విత్తనాలు అమ్మితే వారి దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామంటూ సిద్దిపేట పాలనాధికారి వెంకటరామ్‌రెడ్డి అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మల్లన్నసాగర్‌ నిర్మించి వందలాది కుటుంబాలు వారు స్వగ్రామాలు, ఇళ్లను వదిలి దిక్కులేని వారిగా మారేలా చేసింది మీరు కాదా? అని ప్రశ్నించారు. తెరాస ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్‌ అంతటా ఆ పార్టీ జెండాలను కట్టారు.. మరి వాటికి ఎంత జరిమానా విధిస్తారో పురపాలక మంత్రి కేటీఆర్‌ సమాధానం చెప్పాలని ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని