డిసెంబరులో కొత్త పార్టీ!

ప్రధానాంశాలు

డిసెంబరులో కొత్త పార్టీ!

కేంద్ర మాజీ మంత్రి శివశంకర్‌ తనయుడు వినయ్‌కుమార్‌ వెల్లడి

మెహిదీపట్నం, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా రైతులు, నిరుద్యోగులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని.. అట్టడుగు వర్గాలకు విద్య, వైద్యం అందని ద్రాక్షలా మారాయని కేంద్ర మాజీ మంత్రి పి.శివశంకర్‌ తనయుడు, ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ వినయ్‌కుమార్‌ అన్నారు. రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నానని, డిసెంబరులో పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఆయన తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదవిలో, కుర్చీలో కూర్చునేందుకు రాజకీయాల్లోకి రావడం లేదని, కలలు కన్న తెలంగాణను అందరం కలిసి సాధించుకుందామని పిలుపునిచ్చారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని