సుప్రీం నిర్ణయం కేంద్రానికి చెంపపెట్టు: నారాయణ

ప్రధానాంశాలు

సుప్రీం నిర్ణయం కేంద్రానికి చెంపపెట్టు: నారాయణ

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: పెగాసస్‌పై సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ నియమించడం కేంద్రానికి చెంపపెట్టు అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానికి సన్నిహితుడు అదానీకి చెందిన ముంద్రా పోర్టులో హెరాయిన్‌ పట్టుబడిన విషయాన్ని మరుగున పడేసేందుకు ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్‌ వివాదాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. తమ రాష్ట్రంలోకి ఆంధ్ర నుంచి గంజాయి వస్తోందంటున్న కేసీఆర్‌.. జగన్‌ను నిలదీయవచ్చు కదా అని ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సాగు చట్టాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా అనధికారికంగా అమలవుతూనే ఉన్నాయని చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని