స్థానికేతరులను బయటకు పంపండి: ఈసీ

ప్రధానాంశాలు

స్థానికేతరులను బయటకు పంపండి: ఈసీ

ఈనాడు, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అంశాలను గుర్తించి వాటికి అడ్డుకట్ట వేయాలని, నిఘా విస్తృతం చేయాలని, స్థానికేతరులు ఎవరూ అక్కడ ఉండకుండా చూడాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ కరీంనగర్‌, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు స్పష్టం చేశారు. అక్కడి ఏర్పాట్లపై ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నిఘా పెంచాలి. మద్యం, నగదు పంపిణీ జరగకుండా చర్యలు తీసుకోవాలి. కేంద్రం నుంచి వచ్చిన 20 కంపెనీల బలగాలను నియోజకవర్గం అంతటా మోహరించాలి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే తక్షణం అక్కడికి ప్రత్యేక బృందాలను పంపాలి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా కట్టుదిట్టంగా బందోబస్తు ఏర్పాట్లు చేయాలి. ప్రచారం ముగిసినందున స్థానికేతరులు ఎవరూ నియోజకవర్గంలో ఉండకూడదు. ఎన్నికల నియమావళిని కఠినంగా అమలు చేయాలి. కొవిడ్‌ మార్గదర్శకాలను విధిగా పాటించాలి’ అని శశాంక్‌ గోయల్‌ అధికారులకు స్పష్టం చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని