మద్దతు ధరకు వరి కొనుగోలు చేయాల్సిందే

ప్రధానాంశాలు

మద్దతు ధరకు వరి కొనుగోలు చేయాల్సిందే

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పక్కన మహేశ్వర్‌రెడ్డి, కోదండరెడ్డి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిందేనని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కోటి ఎకరాల మాగాణి పండిస్తామని, తెలంగాణను రైస్‌ బౌల్‌ చేస్తామని చెప్పిన కేసీఆర్‌ మాటలు ఏమయ్యాయని నిలదీశారు. అకస్మాత్తుగా వరి వేయొద్దంటే ఎలాగన్నారు. సిద్దిపేట కలెక్టర్‌ వెంకటరామరెడ్డి తీరును పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. సుప్రీంకోర్టుకు వెళ్లినా వినను అని చెప్పడానికి ఆయనకు ఉన్న అధికారాలేంటని ప్రశ్నించారు. రైతుల పక్షాన పార్టీ పోరాటం చేస్తుందని ఉత్తమ్‌ స్పష్టంచేశారు. హుజూరాబాద్‌ ఓటర్లు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. రైతులు వరి సాగుకు సిద్ధమైన సమయంలో ప్రభుత్వం హఠాత్తుగా భయాందోళనలకు గురిచేస్తోందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఏ పంట సాగు చేయాలో రైతులకు స్వేచ్ఛ ఉండాలని, ఆంక్షలు సరికాదని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని