తెరాస హామీలు గాలికి: షర్మిల

ప్రధానాంశాలు

తెరాస హామీలు గాలికి: షర్మిల

పాదయాత్రలో షర్మిల.. పక్కన యాంకర్‌ శ్యామల

ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, కందుకూరు, న్యూస్‌టుడే: ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి.. ఒక చీర మాత్రమే ఇచ్చారని వైతెపా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ పాలనలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో ప్రారంభమైన ప్రజా ప్రస్థానం పాదయాత్ర రాచులూరు, బేగంపేట, మాదాపూర్‌ గ్రామాల మీదుగా సాగింది. సాయంత్రానికి ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామానికి చేరింది. వైఎస్సార్‌ అభిమానులు, మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఆమె వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ నిర్వహించిన ‘మాట ముచ్చట’ కార్యక్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ‘‘తెరాస ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అర్హులకు పింఛన్లు ఇవ్వడం లేదు. విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ రాకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దళితులకు మూడెకరాల భూమి హామీని మరిచిపోయారు. వరి పండించిన వారు ఉరి వేసుకోవాలా? రాజశేఖర్‌రెడ్డి పాలనలో మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చారు. ఇప్పుడు రూపాయి పావలా వడ్డీ పడుతోంది. రైతు హక్కుల కోసం వారి తరఫున పోరాటం చేస్తాం’’ అని అన్నారు. పాదయాత్రలో యాంకర్‌ శ్యామల పాల్గొని షర్మిలతో పాటు నడిచారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని